పారిశుధ్య కార్మికులను నియమించాలి
ABN , Publish Date - May 23 , 2025 | 12:17 AM
పాలకొండ నగర పంచాయతీలో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పోస్టుల్లో కరోనా కాలంలో పనిచేసిన పారిశుధ్య కార్మికులను నియమించాలని మునిపిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లా యీస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ గౌరవాధ్యక్షుడు దావాల రమణారావు డిమాండ్ చేశారు.ఈ
పాలకొండ, మే 22 (ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీలో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పోస్టుల్లో కరోనా కాలంలో పనిచేసిన పారిశుధ్య కార్మికులను నియమించాలని మునిపిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లా యీస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ గౌరవాధ్యక్షుడు దావాల రమణారావు డిమాండ్ చేశారు.ఈ మేరకు గురువారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులందరికీ ఉపాధి కల్పించాలన్నారు. సమస్యల పరిష్కా రానికి కార్మిక సంఘాలతో అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కార్య క్రమంలో సంజీవి, రఘు, శ్రీదేవి, విమల, ఆంజనేయులు పాల్గొన్నారు.