ఇతర విధుల్లో పారిశుధ్య కార్మికులు
ABN , Publish Date - May 17 , 2025 | 12:31 AM
నగర పం చాయతీలో పలువురు పారిశుధ్య కార్మికులు ఇతర విధుల్లో నిమగ్నమవుతున్నా రని కొంత మంది కౌన్సిలర్లు ఆరో పించారు.
పాలకవర్గ సమావేశం దృష్టికి తీసుకొచ్చిన కౌన్సిలర్లు
పాలకొండ, మే 16 (ఆంధ్రజ్యోతి): నగర పం చాయతీలో పలువురు పారిశుధ్య కార్మికులు ఇతర విధుల్లో నిమగ్నమవుతున్నా రని కొంత మంది కౌన్సిలర్లు ఆరో పించారు. ఈ విషయా న్ని శుక్రవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో చైర్‌పర్సన్ ఆకుల మల్లీ శ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశం లో ప్రస్తావించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ పారిశుధ్య పనులకు నియమించిన సిబ్బంది ఆ పను ల్లోనే నిమగ్నం కావాలని కమిషనర్ రత్నరాజుకు సూచించారు. అలాగే కౌన్సిల్ తీర్మానం లేకుండా శానిటేషన్ సిబ్బందిగా ఒక వ్యక్తి ని నియమించడం పట్ల కౌన్సిలర్లు వ్యతి రేకించారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా కొంత మొత్తాన్ని వసూలు చేసి విధుల్లోకి తీసుకున్నారని, ఆ వ్యక్తిని తొలగించాలని పలువరు కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి అటువంటి నియామకాలపై దృష్టి పెట్టాలని కమిషనర్‌కు సూచించారు. పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న కల్వర్టును తొలగించారని, కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఓ కౌన్సిలర్ కోరారు. కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని, నిర్మాణం చేపడతామని కమిషనర్ తెలిపారు. పట్టణంలో జరిగే ఏ అభివృద్ధి పనులకైనా టెండర్లు వేసే క్రమంలో ఒక్క టెండర్ వస్తే రద్దు చేసి మళ్లీ టెండర్లకు పిలవాలని కమిషనర్‌కు ఎమ్మెల్యే సూచించారు.