Boat Ride బోటు షికారుకు మోక్షం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:38 PM
Salvation Through a Boat Ride తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో బోటు షికారుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వాస్తవంగా నాగావళి నదిలో రోజురోజుకూ పేరుకుపోతున్న గుర్రపు డెక్క బోటు షికారుకు అడ్డంకిగా మారింది. దీంతో పర్యాటకులు ఎంతో నిరాశ చెందుతున్నారు. దీనిపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
కదిలిన అధికారులు
గరుగుబిల్లి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో బోటు షికారుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వాస్తవంగా నాగావళి నదిలో రోజురోజుకూ పేరుకుపోతున్న గుర్రపు డెక్క బోటు షికారుకు అడ్డంకిగా మారింది. దీంతో పర్యాటకులు ఎంతో నిరాశ చెందుతున్నారు. దీనిపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బందిలో కదలిక వచ్చింది. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతో ఐటీడీఏ జేఈ జి.తిరుపతిరావు శుక్రవారం ప్రాజెక్టు పరిధిలోని కుడి మట్టికట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. గుర్రపు డెక్క లేని ప్రాంతంలో బోటు షికారు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాగా గతంలో పర్యాటకశాఖ కొనుగోలు చేసిన బోటు, ఐటీడీఏకు సంబంధించిన మరో బోటును సిద్ధం చేశారు. ఒక బోటుపై సుమారు 27 మంది షికారు చేసేందుకు వీలుంది. ఇదిలా ఉండగా ఫెడల్ బోటు, నాలుగు కియోకాయ్ బోట్లును సిద్ధం చేశారు. మరో ఫెడల్ బోటు కొనుగోలు చేస్తామని జేఈ తెలిపారు. కొద్ది రోజుల్లో బోటు షికారు ప్రారంభిస్తామన్నారు. మొత్తంగా ఒకవైపు బోటు షికారు, మరోవైపు ఐటీడీఏ పార్కుతో తోటపల్లి పర్యాటకులతో కిటకిటలాడనుంది.