Share News

‘తల్లికి వందనం’ మంచి పథకం

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:09 AM

ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వంద నం కార్యక్రమం చాలా గొప్పదని.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు.

‘తల్లికి వందనం’ మంచి పథకం
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున

  • త్వరలోనే అన్నదాత సుఖీభవ

  • వైసీపీ పుస్తకాన్ని చెత్తబుట్టలో వేయండి

  • డీసీసీబీ చైర్మన్‌ నాగార్జున

విజయనగరం రూరల్‌, జూన్‌ 17 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వంద నం కార్యక్రమం చాలా గొప్పదని.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ... మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సూపర్‌ సిక్స్‌ పఽథకాలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని గుర్తు చేశా రు. గత వైసీపీ ప్రభు త్వంలో ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉన్న ప్పటికీ.. ఒక్కరికే అమ్మ ఒడి పథకాన్ని వర్తింప జేసిందని విమర్శించారు. తాము చెప్పిన ప్రకా రం తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో చదువు కుంటున్న పిల్లలు అందరికీ అందించామని తెలి పారు. వైసీపీ అధికార సోషల్‌ మీడియా వేదిక గా స్థాయికి తగ్గి ప్రవర్తించిందని విమర్శించా రు. గత ఐదేళ్లూ నీచమైన పరిపాలన అందిం చిన నేపథ్యంలోనే ప్రజలు వైసీపీని ఇంట్లో కూర్చోబెట్టారన్నారని ఎద్దేవా చేశారు. రూ.3 వేలు పింఛను పెంచడానికి ఐదేళ్లు పట్టింద న్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులు రైతులకు సకాలంలో చెల్లించలేదని ఆరోపించారు. అన్నదా త సుఖీభవ పథకం ద్వారా రైతుల అకౌంట్లలో త్వరలోనే నిధులు జమ కానున్నా యన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు15 నుంచి అమలు చేయనున్నట్టు తెలిపారు.

చెత్తబుట్టలో వేయండి..

వైసీపీ రూపొందించిన పుస్తకాలను చెత్తబు ట్టలో వేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగా ర్జున చెప్పారు. వైసీపీ వైఫల్యాలను కప్పిపుచ్చు కుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని చూస్తున్నా రన్నారు. టీడీపీ నాయకులు దంగా భూలోక, చినబాబు, రాములప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:09 AM