Share News

Durga దుర్గాదేవీ నమోస్తుతే

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:25 PM

Salutations to Goddess Durga ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గమ్మ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది.

  Durga దుర్గాదేవీ నమోస్తుతే
ఘటాలతో ఆలయానికి వెళ్తున్న భక్తులు

  • పాలకొండలో సంబరాల సందడి

పాలకొండ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గమ్మ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రధాన అర్చకుడు డి. లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, పుష్పాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కుంకుమపూజలు చేశారు. మరోవైపు సామూహిక సంబరాలు సందర్భంగా శక్తివేషాలు, ఘటాలతో పాలకొండ పట్టణం హోరెత్తింది. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణంలో కొందరు కోళ్లు, పసుపు, కుంకుమ చూపించి మొక్కులు చెల్లించారు. మరోవైపు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. ఈవో వీవీ సూర్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది, పోలీసులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:25 PM