Share News

కాలువలో పడి సాలూరు వాసి మృతి

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:04 AM

పెద్దగెడ్డ జలాశయం కాలువలో పడి సాలూరు గొడగలవీధికి చెందిన ముంజేటి నాగేంద్రబాబు మృతి చెందాడు.

 కాలువలో పడి సాలూరు వాసి మృతి

పాచిపెంట, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పెద్దగెడ్డ జలాశయం కాలువలో పడి సాలూరు గొడగలవీధికి చెందిన ముంజేటి నాగేంద్రబాబు మృతి చెందాడు. పోలీసులు,స్థానికుల కథనం మేరకు.. సాలూరుకు చెందిన ముంజేటి నాగేంద్ర బాబు చుట్టు పక్కల గ్రామాల్లో ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మెటీరియల్‌ ఏరుకుని జీవిస్తున్నాడు. నాగేంద్రబాబు తన భార్య కరిస్మాతో బాటిళ్లు ఏరడానికి వెళ్తానని ఈనెల ఏడో తేదీన చెప్పాడు. భర్త తిరిగి ఇంటికి రాకపోవడంతో కు టుంబ సభ్యులు వెతికారు.ఇంతలో శుక్రవారం సాయంత్రం పెద్దగెడ్డ జలాశయం కాలువలో పడి మృతి చెందడాన్ని గుర్తించారు. వెంటనే భార్య కరిస్మాకు సమాచారం చేరవేయడంతో వెంటనే పాచిపెంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హెచ్‌సీ కృపారావు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాలూరు పీహెచ్‌సీకి తరలించారు.

Updated Date - Aug 10 , 2025 | 12:04 AM