Share News

Shootings షూటింగ్‌లకు సాలూరు ఏజెన్సీ అనుకూలం

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:15 PM

Salur Agency Ideal for Film Shootings పర్యాటకానికి, సినిమా షూటింగ్‌లకు సాలూరు ఏజెన్సీ అనుకూలమని జిల్లా పర్యాటక, సాంస్కృతిక అధికారి నంబూరు నారాయణరావు తెలిపారు. ఆదివారం సాలూరు మండలంలో శిఖపరువు జలపాతం, వెంగళరాయసాగర్‌ను పరిశీలించారు.

 Shootings షూటింగ్‌లకు  సాలూరు ఏజెన్సీ అనుకూలం
శిఖపరువు జలపాతాన్ని పరిశీలిస్తున్న జిల్లా పర్యాటక,సాంస్కృతిక అధికారి నారాయణరావు

సాలూరు రూరల్‌, సెప్టెంబరు7(ఆంధ్రజ్యోతి): పర్యాటకానికి, సినిమా షూటింగ్‌లకు సాలూరు ఏజెన్సీ అనుకూలమని జిల్లా పర్యాటక, సాంస్కృతిక అధికారి నంబూరు నారాయణరావు తెలిపారు. ఆదివారం సాలూరు మండలంలో శిఖపరువు జలపాతం, వెంగళరాయసాగర్‌ను పరిశీలించారు. పచ్చని కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, ఆనకట్ట తదితర ప్రాంతాలు పర్యాటక అభివృద్ధికి అనువుగా ఉన్నాయన్నారు. దీనిపై కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌కు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. యూ ట్యూబర్లు తమ కంటెంట్‌కు అనువుగా ఇక్కడ చిత్రీకరణ చేసుకోవచ్చని సూచించారు. మన్యంపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. పర్యాటక అభివృద్ధికి ఔత్సాహికులు సైతం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Sep 07 , 2025 | 11:15 PM