Share News

GCC జీసీసీ ద్వారా నాణ్యమైన వస్తువుల విక్రయం

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:57 AM

Sale of Quality Goods through GCC జిల్లాలో జీసీసీ ద్వారా నాణ్యమైన వస్తువులను వి క్రయిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. జన్‌ జాతీయ గౌరవ దినోత్సవంలో భాగంగా సోమవారం పార్వతీపురం ఐటీడీఏలో ప్రత్యేక గిరిజన సంతను ప్రారంభించారు.

 GCC  జీసీసీ ద్వారా నాణ్యమైన వస్తువుల విక్రయం
సంతలో విక్రయించనున్న సరుకులను పరిశలిస్తున్న జేసీ

పార్వతీపురం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జీసీసీ ద్వారా నాణ్యమైన వస్తువులను వి క్రయిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. జన్‌ జాతీయ గౌరవ దినోత్సవంలో భాగంగా సోమవారం పార్వతీపురం ఐటీడీఏలో ప్రత్యేక గిరిజన సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గిరిజనుల వద్ద నాణ్యమైన వస్తువులు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి. అటవీ ఉత్పత్తులను నేరుగా గిరిజనుల నుంచి కొనుగోలు చేయడం వల్ల వారికి మద్దతు ధర లభిస్తుంది. గిరిజన రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేయాలి. దళారుల నుంచి వారిని రక్షించేందుకే గిరిజన సంత నిర్వహిస్తున్నాం.’ అని తెలిపారు. అనంతరం ఐటీడీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జేసీ సందర్శించారు. ఈ కార్య క్రమంలో ఏపీవో మురళీధర్‌, జీసీసీ డివిజన్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 12:57 AM