Share News

నెలకు రూ.3 లక్షల జీతం

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:25 AM

Salary Rs.3 lakh per month బీఎస్సీ నర్సింగ్‌ చేసిన నిరుద్యోగులకు జర్మనీ లాంగ్వేజ్‌ నేర్పించి, ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చి, వీసాలు కూడా ఇప్పించి జర్మనీలో నెలకు సుమారు రూ.3లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాలు కల్పిస్తామని జిల్లా స్కిల్‌ డవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

నెలకు రూ.3 లక్షల జీతం
మాట్లాడుతున్న ప్రశాంత్‌కుమార్‌

నెలకు రూ.3 లక్షల జీతం

జర్మనీలో ఉద్యోగం కల్పిస్తాం.. శిక్షణకు రండి

జిల్లా స్కిల్‌ డవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌కుమార్‌

రామభద్రపురం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): బీఎస్సీ నర్సింగ్‌ చేసిన నిరుద్యోగులకు జర్మనీ లాంగ్వేజ్‌ నేర్పించి, ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చి, వీసాలు కూడా ఇప్పించి జర్మనీలో నెలకు సుమారు రూ.3లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాలు కల్పిస్తామని జిల్లా స్కిల్‌ డవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన జాబ్‌మేళాలో ప్రైవేటు రంగంలో 2 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రస్తుతం నిరుద్యోగ యువతకు కంప్యూటర్‌, టైలరింగ్‌, సర్వేయర్‌, ఏసీ టెక్నీషియన్స్‌, ప్లంబింగ్‌, ఫాబ్రికేటెడ్‌ వంటి రంగాల్లో 3 వేల మందికి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇంజనీరింగ్‌, డిప్లమో తదితర రంగాల్లో చదివిన నిరుద్యోగ యువతకు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి వీరికి కూడా జర్మనీలో ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు ఫోన్‌ నంబర్‌ 9988853335కు సంప్రదించాలని కోరారు.

Updated Date - Mar 14 , 2025 | 12:25 AM