వేతన బకాయిలు చెల్లించాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:07 AM
పంచాయతీకార్మికులకు వేతన బకాయి లు చెల్లించకపోవడంతో శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టారు. గజపతినగరం, పురిటిపెంట పంచాయతీలకు చెందిన పారిశుధ్య కార్మికులుబకా యిలను చెల్లించాలని సచివాలయాలు వద్ద నిరసన వ్యక్తం చేశారు.
గజపతినగరం, నవంబరు14(ఆంధ్రజ్యోతి): పంచాయతీకార్మికులకు వేతన బకాయి లు చెల్లించకపోవడంతో శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టారు. గజపతినగరం, పురిటిపెంట పంచాయతీలకు చెందిన పారిశుధ్య కార్మికులుబకా యిలను చెల్లించాలని సచివాలయాలు వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లక్ష్మి, బి,కనకరాజు, కోటేశ్వరరావు, భాస్కరరావు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రాజాం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐ టీయూ నాయకులు కోరారు.ఈమేరకు శుక్రవారం రాజాంమునిసిపల్ కమిషనర్ రామ చంద్రరావును సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్, జిల్లా కార్యదర్శి ఎం.త్రినాఽథ్, కార్య దర్శి ఎన్.రవి, కమిటీ సభ్యులు పి.రాజేష్, లక్ష్మి, వి.చిన్నబాబు, పి. గిరిబాబు కలిశారు.