వేతన బకాయిలను చెల్లించాలి
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:06 AM
గజపతినగరం, పురిటిపెంట గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనబకాయిలను తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లాఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి కోరారు.
గజపతినగరం, నవంబరు12(ఆంధ్రజ్యోతి): గజపతినగరం, పురిటిపెంట గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనబకాయిలను తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లాఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి కోరారు. బుధవారం గజపతిన గరం గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.