Salaries అక్టోబరు 3 నుంచే జీతాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:32 PM
Salaries from October 3 మెగా డీఎస్సీ టీచర్లకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత నెల 3 నుంచే జీతాల చెల్లింపునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ నేతల మోహనరావు ఉత్తర్వులు విడుదల చేశారు.
సాలూరు రూరల్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ టీచర్లకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత నెల 3 నుంచే జీతాల చెల్లింపునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ నేతల మోహనరావు ఉత్తర్వులు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 578 మంది మెగా డీఎస్సీ టీచర్లు గత నెల 11 నుంచి విధుల్లో చేరారు. కాగా విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలసలో వారికి గత నెల 3 నుంచి 10 వరకు శిక్షణ కు హాజరయ్యారు. అయితే శిక్షణ కార్యక్రమంలో వారు చేరినప్పటి నుంచే జీతాలు చెల్లించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో నూతన టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.