Obstruction… అడ్డుగా ఉన్నాయని..
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:22 AM
Said to Be an Obstruction… అవలంగి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం గోనె సంచులను ఓ వ్యక్తి బయట పడేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం సుమారు నాలుగు వందల గన్నీ బ్యాగ్‌లు రైతు సేవా కేంద్రానికి వచ్చాయి. వీటిని ఆర్‌ఎస్‌కేలో కలాసీలు భద్రపరిచారు. అయితే తమ కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నాయని వాటిని ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బయట పడేసినట్టు రైతులు చెబుతున్నారు.
పాలకొండ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): అవలంగి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం గోనె సంచులను ఓ వ్యక్తి బయట పడేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం సుమారు నాలుగు వందల గన్నీ బ్యాగ్‌లు రైతు సేవా కేంద్రానికి వచ్చాయి. వీటిని ఆర్‌ఎస్‌కేలో కలాసీలు భద్రపరిచారు. అయితే తమ కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నాయని వాటిని ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బయట పడేసినట్టు రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఏఈవో శ్రావణి అక్కడకు చేరుకుని.. గన్నీ బ్యాగ్‌లను తిరిగి భద్రపర్చాలని కోరారు. అయితే అవి తమకు అడ్డంకిగా ఉన్నాయని వాదించినట్టు తెలుస్తోంది. దీనిపై ఏఈవోను వివరణ కోరగా.. గన్ని బ్యాగ్‌లను తిరిగి భద్రపర్చాలని కోరామన్నారు. అయితే స్థానిక రైతులు మాత్రం వాటిని వ్యాన్‌లో ఎక్కించి వేరే చోటకు తరలించారన్నారు. వాస్తవంగా ఈ ఆర్‌ఎస్‌కేని పంచాయతీ కార్యాలయంగా కూడా వినియోగిస్తున్నారు. అయితే 2020 నుంచి ఎరువులు, ఇతర సామగ్రిని ఇక్కడే భద్రపరుస్తుండగా.. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకుని రైతులు ప్రశ్నిస్తున్నారు.