Safe Water Supply సురక్షిత నీటిని సరఫరా చేయాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:17 AM
Safe Water Supply Must Be Ensured జిల్లాలో కురిసిన వర్షాల నేపథ్యంలో ప్రతి గ్రామానికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి గ్రామీణ నీటి సరఫరా, పీఆర్ శాఖాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్వతీపురం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురిసిన వర్షాల నేపథ్యంలో ప్రతి గ్రామానికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి గ్రామీణ నీటి సరఫరా, పీఆర్ శాఖాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవా లన్నారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానం ఉండే ప్రదేశాల్లో నీటి పరీక్షలు నిర్వహించాలని తేల్చిచెప్పారు. పైపులైన్లు దెబ్బతినే చోట తాగునీటి సరఫరా నిలిచిపోరాదని, అటువంటివి వాటికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పారిశుధ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఆదికర్మ యోగి పథకంతో గిరిజన గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన గ్రామాల్లో పాలన, సేవల మెరుగుకు శిక్షణ పొందిన కార్యకర్తలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ ఏపీవో ఏ.మురళీధర్ రాష్ట్రస్థాయి శిక్షకుడిగా శిక్షణ పొందారన్నారు. జిల్లా స్థాయి శిక్షకుల మొదటి బ్యాచ్‌ను ఈ నెల13 వరకు పార్వతీపురం ఐటీడీఏలో నిర్వహించామని వెల్లడించారు. రెండో బ్యాచ్ ఈ నెల 21 వరకు జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో 165 గ్రామాల్లో సుమారు 83 వేల మంది గిరిజనులు ప్రయోజనం పొందుతారన్నారు.