Saare with 300 types of sweets 300 రకాల పిండివంటకాలతో సారె
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:18 PM
Saare with 300 types of sweets
300 రకాల పిండివంటకాలతో సారె
కొత్తవలస, నవంబర్ 2 (ఆంధ్రజ్యోతి) : గౌరీపరమేశ్వరుల ఉత్సవాల్లో భాగంగా మంగళపాలెం గ్రామంలో ఆదివారం 300 రకాల పిండివంటకాలు, పండ్లుతో భక్తులు సారె సమర్పించారు. ఈ గ్రామంలో ఏటా కార్తీకమాసంలో గౌరీపరమేశ్వర్లను ప్రతిష్ఠించి సారె ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి కూడా పిండి వంటలను తయారుచేసి వాటిని గ్రామంలో ఊరేగించి రామాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా 500 మంది మహిళలకు చీరలను కూడా పంపిణీ చేశారు భారీ అన్న సమారాధన ఏర్పాటుచేశారు.