Hospital ఏరియా ఆసుపత్రి కిటకిట
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:56 AM
Rush at Area Hospital ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఏజెన్సీలో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా చిన్నారులు బ్లడ్ ఇన్‌ఫెక్షన్లతో నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం సీతంపేట ఏరియా ఆసుపత్రి రోగులతో కిక్కిరిసింది.
చిన్నారులను వేధిస్తున్న బ్లడ్ ఇన్‌ఫెక్షన్
సీతంపేట రూరల్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఏజెన్సీలో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా చిన్నారులు బ్లడ్ ఇన్‌ఫెక్షన్లతో నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం సీతంపేట ఏరియా ఆసుపత్రి రోగులతో కిక్కిరిసింది. మొత్తంగా 345 వరకు ఓపీ నమోదైంది. ఇందులో జ్వరం, బ్లడ్ ఇన్‌ఫెక్షన్ వంటి అనారోగ్య సమస్యలతో 57మంది చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ఇన్‌పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరారు. 61 మంది జ్వరపీడితుల్లో 36మంది ఇన్‌పేషెంట్లుగా చేరారు. ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు చెప్పారు.