Share News

Rural Development ‘ఉపాధి’తో గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - May 17 , 2025 | 11:17 PM

Rural Development through upadhi ఉపాధి హామీ పథకంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు. శనివారం లక్ష్మీనారాయణపురంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు.

Rural Development  ‘ఉపాధి’తో గ్రామాల అభివృద్ధి
వేతనదారులకు మజ్జిగ అందిస్తున్న జిల్లా ప్రత్యేకాధికారి

పార్వతీపురం రూరల్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు. శనివారం లక్ష్మీనారాయణపురంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలకు కావాల్సిన రహదారులు, కాలువలు, చెరువుల్లో పూడికతీత, భూమి చదును పనులు, ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్‌, నీటి కుంటల నిర్మాణం వంటివి చేసుకోవచ్చు. పర్యావరణ , మౌలిక వసతుల అభివృద్ధి, జలనవనరుల నిర్వహణ, వ్యవసాయ పనులు, కూడా నిర్వహించుకోవచ్చు. వేతనదారులు స్వగ్రామాల్లోనే పనులను చేసుకుని వేతనాన్ని పొందొచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు. అనంతరం చలివేంద్రం ద్వారా కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని సందర్శించి వేతనదారులకు పరీక్షలు చేయించారు. ఆయన వెంట కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌, డ్వామా పీడీ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:17 PM