Rules Must Be Followed.. నిబంధనలు పాటించాల్సిందే..
ABN , Publish Date - May 28 , 2025 | 11:37 PM
Rules Must Be Followed.. జిల్లాలో సినిమా థియేటర్లను నిబంధనల మేరకు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక ఆదేశించారు.నర్సిపురంలోని ఓ థియేటర్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పార్వతీపురం రూరల్, మే 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సినిమా థియేటర్లను నిబంధనల మేరకు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక ఆదేశించారు.నర్సిపురంలోని ఓ థియేటర్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఆర్‌పీ ప్రకారం స్నాక్స్ విక్రయిస్తున్నారా.. లేదా? అన్నది పరిశీలించారు. కాలం చెల్లినవి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించాలని ఆహారభ ద్రతా అధికారి రామయ్యను ఆదేశించారు. క్యాంటీన్‌లో వస్తువుల ధరలను పరిశీలించారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే బయటకు ఎలా వెళ్తారన్నది నిశితంగా గమనించారు.పారిశుధ్యం, భద్రత ప్రమాణాలు, మరుగుదొడ్ల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి అనధికారికంగా సినిమా టిక్కెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు.