ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:58 PM
మండలంలో పేరాపురం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ లారీని శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది.
పూసపాటిరేగ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలో పేరాపురం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ లారీని శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జయ్యింది. బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాల య్యాయి. వీరిని సమీపంలోని సుందరపేట సీహెచ్‌సీకి తరలించి, చికిత్స చేశారు. అదపాక బంగారమ్మ అనే ప్రయాణికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు.