కోర్టు భవన నిర్మాణానికి రూ.8.50 కోట్లు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:32 AM
శృంగవరపుకోట సివిల్ న్యాయాధికారి కోర్టు భవన నిర్మాణానికి రూ.8.50 కోట్ల నిధులను కేటాయించినట్టు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు.
శృంగవరపుకోట, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట సివిల్ న్యాయాధికారి కోర్టు భవన నిర్మాణానికి రూ.8.50 కోట్ల నిధులను కేటాయించినట్టు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఆమె సోమవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. సోమవారం శాసన వ్యవహా రాలు, న్యాయ విభాగాల కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి పరిపాలన అనుమతులు మంజూరు చేశారని చెప్పారు. ఈ కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరాయన్నారు. ప్రస్తుతం ఈ కోర్టు కార్యకలాపాలు అద్దె భవనంలో నడుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం కోర్టు శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు అందించడం ఆనందంగా ఉందన్నారు. త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. శాశ్వత భవనం లేకపోవడంతో న్యాయాధికారితో పాటు న్యాయవాదులు, క్షక్షిదారులకు ఇబ్బందిగా ఉందన్నారు. ఈ కోర్టు న్యాయవాదులు భవనాల నిర్మాణం కోసం చాలా రోజులుగా అడుగుతు న్నారన్నారు. కూటమి ప్రభుత్వం సహకారంతో ఇప్పటికి వీరి కోరిక నేరవేరిందన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి ఫరూక్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.