పెద్దగెడ్డకు రూ.67 కోట్ల మంజూరు
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:55 PM
పాచిపెంట సమీపంలో వేగావతి నదిపై ఉన్న పెద్దగెడ్డ జలాశయాన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా కేంద్రప్రభుత్వం సీఎం చంద్రబాబునా యుడు సూచనల మేరక ప్రకటించి రూ.67 కోట్ల మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
సాలూరు, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పాచిపెంట సమీపంలో వేగావతి నదిపై ఉన్న పెద్దగెడ్డ జలాశయాన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా కేంద్రప్రభుత్వం సీఎం చంద్రబాబునా యుడు సూచనల మేరక ప్రకటించి రూ.67 కోట్ల మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈనిధులతో పైపుల ద్వారా సాగునీటిని అందించేదుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. శనివారం సాలూరులో మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించు కున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్రఉపాధ్యక్షుడు ఆర్పీభంజ్‌దేవ్‌ను పరామర్శించారు.ఈసం దర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సాలూరుకు సమీపంలో కొట్టక్కి వద్ద వంద ఎకరాల్లో పార్కు, చిన్న, పెద్దతరహా పరిశ్రమలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసి నట్టు తెలిపారు. మొదటివిడతగా రూ.10 కోట్లు పార్కు నిర్మాణం కోసం మంజూరైనట్లు చెప్పారు. సాలూరుకు సుమారు 10కిలోమీటర్ల దూరంలో గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. పెద్దగెడ్డ జలాశయన్ని స్పెషల్ ప్రాజెక్టుగా ప్రకటించడంతో పైపులైన్లు ఏర్పాటుచేసి మరిన్ని భూములకు సాగునీరిచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికే ఆ యాజమాన్యంతో మాట్లాడా మని,తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.లారీఅనుబంధ పరిశ్రమను కూడా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యక్రమం లో టీడీపీపట్టణాధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, పాచిపెంట నాయకులు పిన్నింటి ప్రసాద్‌బాబు, పప్పల మోహనరావు, డబ్బి కృష్ణ, బలగ పైడిరాజు పాల్గొన్నారు.