పింఛన్ డబ్బుల్లో రూ.50వేలు మాయం
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:19 AM
మండలంలోని మండవకురిటి గ్రామానికి సంబంధించిన పింఛన్ సొమ్ము రూ.33లక్షల 45వేల 500లో రూ.50 వేలు మాయం అయినట్టు పంచాయతీ కార్యదర్శి సురేష్‌కుమార్ సంతకవిటి మండల అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
సంతకవిటి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని మండవకురిటి గ్రామానికి సంబంధించిన పింఛన్ సొమ్ము రూ.33లక్షల 45వేల 500లో రూ.50 వేలు మాయం అయినట్టు పంచాయతీ కార్యదర్శి సురేష్‌కుమార్ సంతకవిటి మండల అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పైఅధికారుల ఆదేశాల తో 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ సొమ్మును మంగళవారం సిరిపురం యూనియన్ బ్యాంకు నుంచి గ్రామ సర్వేయర్ తీసుకు వచ్చి, పంచాయతీ కార్య దర్శికి, వెల్ఫేర్ అసిస్టెంట్‌కి ఇచ్చారు. బుధవారం పింఛన్లు పంపిణీ చేసే నిమి త్తం మంగళవారం మధ్యాహ్నం వారు సచివాలయ సిబ్బందికి ఈ సొమ్ము ను పంచారు. ఈ పంచే క్రమంలో రూ.50వేలు తక్కువ వచ్చింది. దీంతో పంచా యతీ కార్యదర్శి 100కి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని సంతకవిటి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు సచివాలయ సిబ్బందిని తీసుకు వచ్చి విచారించారు. మాయమైన డబ్బులను కార్యాలయ సిబ్బందిలో ఎవరో ఒకరు తీసి ఉంటారని, వాటిని తిరిగి ఇచ్చేయ్యాలని హెచ్చరించారు. దీనిపై సచివాల య సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు.