వాహనమిత్ర పథకం కింద రూ.25 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:35 AM
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా రూ.25 వేలు ఇవ్వాలని ఆటోడ్రైవర్ల యూనియన్ నాయకులు కోరారు.ఈ మేరకు సోమవారం కొమరాడలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.
కొమరాడ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా రూ.25 వేలు ఇవ్వాలని ఆటోడ్రైవర్ల యూనియన్ నాయకులు కోరారు.ఈ మేరకు సోమవారం కొమరాడలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.అనంతరం తహసీల్దార్ సీహెచ్ సత్యనారాయణకు వినతిపత్రం అందిం చారు.ఈసందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల తామంతా నష్టపోతున్నామని ఆటో యూనియన్ సభ్యులు వాపోయా రు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి సాంబమూర్తి పాల్గొన్నారు.
సీహెచ్‌డబ్ల్యూలకు బకాయి వేతనాలు చెల్లించాలి
బెలగాం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : సీహెచ్‌డబ్ల్యూలకు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నాయకుడు వె.మన్మథరావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద సీహెచ్‌డబ్ల్యూల సమస్యలు పరిష్కరించాలని సీఐటీ యూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సీహెచ్ డబ్ల్యూలకు సంబంధంలేని పనులు చెప్పి పనిభారం పెంచుతున్నారని తెలిపారు.