Rs. 1,000 crore for 'Sujala Sravanti' ‘సుజల స్రవంతి’కి రూ.వెయ్యి కోట్లు
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:49 PM
Rs. 1,000 crore for 'Sujala Sravanti' అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం వరకు పోలవరం ఎడమ కాలువ ద్వారా రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి సంబంధించి కీలక అడుగు పడింది. పథకం పనులు చురుగ్గా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా వెయ్యి కోట్ల రూపాయల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని కూడా భావిస్తోంది.
‘సుజల స్రవంతి’కి రూ.వెయ్యి కోట్లు
మొదటి విడతగా నిధుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్
రెండేళ్లలో పూర్తి చేయాలని ఆదేశాలు
కొత్తవలస, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం వరకు పోలవరం ఎడమ కాలువ ద్వారా రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి సంబంధించి కీలక అడుగు పడింది. పథకం పనులు చురుగ్గా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా వెయ్యి కోట్ల రూపాయల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని కూడా భావిస్తోంది.
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం నుంచి సబ్బవరం మండలం, జిల్లాలోని కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ, శృంగవరపు కోట మండలాలతోపాటు మరికొన్ని మండలాలు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా వరకు ఈ కాలువ నిర్మాణం చేపడ్తారు. ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తి చేశారు. నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలవనరులశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా సన్నాహాలు మొదలయ్యాయి. మొదటి విడతగా ఈ సంవత్సరం రూ.వెయ్యి కోట్లు, వచ్చే సంవత్సరం మరో రూ.వెయ్యికోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు కొండంత అండ లభిస్తుంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈసుజల స్రవంతి పథకం తెరపైకి వచ్చింది. తరువాత 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో సర్వే పనులు కొంత మేర జరిగాయి కాని భూ సేకరణకు నిధులు కేటాయించలేదు. సర్వే చేసి వదిలేయడంతో రైతులు అప్పటి నుంచి ఆ భూములును ఎవరికీ అమ్ముకోవాలని భావించినా కొనేవారు ముందుకు రాక నానా అవస్థలు పడుతున్నారు. కాగా గ్రామాల్లో సభలను ఏర్పాటు చేసి భూములు కోల్పోతున్న బాధిత రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. తమకు మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని, ప్రత్యామ్నాయంగా భూములను కేటాయించాలని కోరుతున్నారు. రైతుల అభిప్రాయాలను అధికారులకు నివేధిస్తామని గ్రామ సభలు నిర్వహిస్తున్న అధికారులు తెలిపారు.