Share News

Seized కుళ్లిన మాంసం, చేపలు సీజ్‌

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:10 AM

Rotten Meat and Fish Seized సాలూరులో కొందరి వ్యాపారుల తీరు మారడం లేదు. యథేచ్ఛగా కుళ్లిన మాంసం, చేపల విక్రయానికి యత్నిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే మున్సిపల్‌ అధికారులు దాడులు జరిపి మార్కెట్లో కుళ్లిన మాంసాన్ని సీజ్‌ చేశారు. దానిని విక్రయించేందుకు యత్నించిన వ్యాపారికి అపరాధ రుసుం విధించారు.

 Seized కుళ్లిన మాంసం, చేపలు సీజ్‌
మాంసం దుకాణాన్ని తనిఖీ చేస్తున్న మున్సిపల్‌, పశుసంవర్థక శాఖ అధికారులు

  • రూ.10 వేలు అపరాధ రుసుం

  • ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

సాలూరు రూరల్‌, జూన్‌10(ఆంధ్రజ్యోతి): సాలూరులో కొందరి వ్యాపారుల తీరు మారడం లేదు. యథేచ్ఛగా కుళ్లిన మాంసం, చేపల విక్రయానికి యత్నిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే మున్సిపల్‌ అధికారులు దాడులు జరిపి మార్కెట్లో కుళ్లిన మాంసాన్ని సీజ్‌ చేశారు. దానిని విక్రయించేందుకు యత్నించిన వ్యాపారికి అపరాధ రుసుం విధించారు. అయితే తాజాగా కొంతమంది మళ్లీ అదేవిధంగా విక్రయాలు జరపడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ‘ఈ మాంసం తింటే అంతే’ శీర్షికన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురించిన విషయం విదితమే. దీనిపై స్పందించిన మున్సిపల్‌, పశు సంవర్థకశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.బాలకృష్ణ, పశుసంవర్థకశాఖకు చెందిన ప్రభాకర్‌, పర్యావరణ కార్యదర్శులు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, జైపూర్‌ రోడ్డు, కోట తదితర ప్రాంతాల్లో మాంసాహార, చేపల అమ్మకాలను పరిశీలించారు. కుళ్లిన పది కిలోల మాంసం, పాడైన 20 కిలోల చేపలను విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. సంబంధిత వ్యాపారులకు రూ. 10 వేల అపరాధ రుసుం విధించారు. సీజ్‌ చేసిన మాంసం, చేపలను బ్లీచింగ్‌ వేసి పాతిపెట్టారు.

మళ్లీ అమ్మితే షాపుల తొలగింపు

ప్రజారోగ్యానికి చేటు తెచ్చే కుళ్లిన, పాడైన మాంసం, చేపలను మళ్లీ విక్రయిస్తే ప్రజారోగ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ వ్యాపారులను హెచ్చరించారు. తొలిసారి కావడంతో అపరాధ రుసుం విధించా మన్నారు. మరోసారి నిబంధనలను అతిక్రమిస్తే షాపులను తొలగిస్తామని హెచ్చ రించారు. వినయోగదారులకు తూనికల్లో మోసం చేయరాదని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగించరాని సూచించారు. తాజా మాంసం, చేపలనే విక్రయించాలన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:10 AM