గిరిజనులకు పోడు పట్టాలు: మంత్రి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:07 AM
: గిరిజనులకు ఈనెల 15న పంపిణీచేయనున్న పోడు భూమి పట్టాలు ఏ పార్టీకి చెందినవారా, తనకు ఓటు వేశారే లేదా అనే అంశం చూడనని, కేవలం పేద గిరిజనులైతే చాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
సాలూరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): గిరిజనులకు ఈనెల 15న పంపిణీచేయనున్న పోడు భూమి పట్టాలు ఏ పార్టీకి చెందినవారా, తనకు ఓటు వేశారే లేదా అనే అంశం చూడనని, కేవలం పేద గిరిజనులైతే చాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి రోజున కూడా మరికొంతమంది పేద గిరిజన రైతులకు పోడు పట్టా లను అందజేస్తామని చెప్పారు. సోమవారం సాలూ రులో విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్న డూలేని విధంగా ప్రపంచ ఆదివాసీ దినత్సోవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గిరిజనులకు వరాల వర్షాన్ని కురిపించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పీడిక రాజన్నదొర ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇంటి ముందు రోడ్డును కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్మించినట్లు తెలిపారు. సాలూరులో అనేక ప్రభుత్వ భవనాలు టీడీపీఅధికారంలో ఉన్న సమయంలో నిర్మాణాలు జరిగాయని ఆమె తెలిపారు. ఆమె వెంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, ఆముదాల పరమేశు, గుళ్ల వేణుగోపాలనాయుడు, గూడెపు యుగంధర్, కేతిరెడ్డి చంద్రశేఖర్, హర్షా, కారేపు చంద్ర ఉన్నారు. అలాగే మండలంలోని జీగిరాం పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు మంత్రి సమక్షంలో టీడీపీలో చేరాయి. వారిని మంత్రి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.