Risky but ప్రమాదమైనా.. తప్పని పడవ ప్రయాణం
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:19 AM
Risky but Unavoidable Boat Journey నాగావళిపై పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి కాకపోవడంతో నదీతీర ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. దీంతో బుధవారం కొమరాడ-కొట్టు గ్రామస్థులు నదిలో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది.
కొమరాడ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): నాగావళిపై పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి కాకపోవడంతో నదీతీర ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. దీంతో బుధవారం కొమరాడ-కొట్టు గ్రామస్థులు నదిలో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది. పార్వతీపురం మీదుగా ఆయా గ్రామాలకు చేరుకోవాలంటే చుట్టూ తిరిగి సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే నదిలో అయితే ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు. దీంతో ఏటా వర్షాకాలంలో ప్రమాదమైనా ఇలా వారు పడవలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాగా ఇప్పుడున్న మర పడవ మరమ్మతులకు గురైంది. భారీ ప్రమాదం సంభవించకముందే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. కాగా పూర్ణపాడు-లాబేసు వంతెన పెండింగ్ పనులు పూర్తయితే 9 పంచాయతీల్లో 42 గ్రామాల ప్రజలకు ఇక్కట్లు తప్పుతాయని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు.