Share News

Vamsadhara వంశధారలో పెరిగిన వరద

ABN , Publish Date - May 30 , 2025 | 11:22 PM

Rising Floods in Vamsadhara ఎగువ ప్రాంతం ఒడిశాలో జోరుగా వర్షాలు కురుస్తుండడంతో భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిలో స్వల్పంగా వరద పెరిగింది. దీంతో శుక్రవారం పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

  Vamsadhara  వంశధారలో పెరిగిన వరద
నేరడి వద్ద వంశధా నదిని దాటుతున్న ప్రయాణికులు

భామిని, మే 29 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతం ఒడిశాలో జోరుగా వర్షాలు కురుస్తుండడంతో భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిలో స్వల్పంగా వరద పెరిగింది. దీంతో శుక్రవారం పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నది దాటి స్వగ్రామాలకు చేరుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ఒడిశా రాష్ట్రం కండవ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణికులు వంశధార నది దాటి నేరడి వచ్చేందుకు కొంత ఇబ్బందులు పడ్డారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని నడుం లోతు నీటిలో నది దాటి ఆంధ్రా వైపు గ్రామాలకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా భామినిలో సాయంత్రం వర్షం కురవడంతో రైతులు కొంత ఇబ్బందులకు గురయ్యారు. మొక్కజొన్న, ధాన్యం కాపాడుకునే పనిలో పడ్డారు.

Updated Date - May 30 , 2025 | 11:22 PM