Share News

Yogandra Arrangements యోగాంధ్ర ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:09 AM

Review of Yogandra Arrangements మక్కువ మండలం వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) సమీపంలోని ఏనుగులకొండ వద్ద మంగళవారం పెద్దఎత్తున యోగాంధ్ర నిర్వహించ నున్నారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో అధికారులు చేస్తున్న ఏర్పాట్లను సోమవారం కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. పర్యాటక ప్రాంతాల్లో భారీగా యోగాంధ్ర నిర్వహిస్తున్నామన్నారు.

  Yogandra Arrangements యోగాంధ్ర ఏర్పాట్ల పరిశీలన
ఏనుగులకొండ వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

అధికారులకు సూచనలిచ్చిన కలెక్టర్‌

పార్వతీపురం/మక్కువ, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) సమీపంలోని ఏనుగులకొండ వద్ద మంగళవారం పెద్దఎత్తున యోగాంధ్ర నిర్వహించ నున్నారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో అధికారులు చేస్తున్న ఏర్పాట్లను సోమవారం కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. పర్యాటక ప్రాంతాల్లో భారీగా యోగాంధ్ర నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే తోటపల్లి, సీతంపేట ప్రాంతాల్లో నిర్వహించామని తెలిపారు. ఏనుగులకొండ వద్ద నిర్వహించే కార్యక్రమం కోసం మాస్టర్‌ ట్రైనీల శిక్షణ పూర్తయిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై యోగాంధ్రను జయప్రదం చేయాలని కోరారు. గ్రామస్థాయి నుంచి యోగా పోటీలు ప్రారంభమయ్యాయన్నారు. ఆయన వెంట డ్వామా పీడీ కె.రామచం ద్రరావు, ఇతర అధికారులు ఉన్నారు.

- జిల్లాలో సామాన్యుల వరకు యోగాను తీసుకెళ్లాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. అన్ని వర్గాల వారిని ఇందులో భాగస్వాములవ్వాలని తెలిపారు. సూర్యఘర్‌ యూనిట్ల రిజిస్ర్టేషన్‌, గ్రౌండింగ్‌ సమాంతరంగా జరగాలన్నారు. పీఎం జన్‌మన్‌ గృహాల నిర్మాణం మరింత వేగవంతం కావాలన్నారు.

‘ఉత్కర్ష్‌ అభియాన్‌’కు అనూహ్య స్పందన

సాలూరు: ధర్తీ ఆబా జన్‌ జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ (డీఏజేజీయూఏ) కార్యక్రమానికి గిరిజనుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. సోమవారం సాలూరు మున్సిపల్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30 వరకు డీఏ జుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీనిలో భాగంగా గిరిజనుల అవసరాలను గుర్తించాలన్నారు. వారికి అవసరమైన ధ్రువపత్రాలు జారీ చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు, మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా పనిచేయాలన్నారు. గ్రామ, క్లస్టర్‌ స్థాయి శిబిరాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని సూచించారు. ఆధార్‌, రేషన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగ, సామాజిక పింఛన్లు, విశ్వకర్మ, ముద్ర రుణాలు, పీవీటీజీ గృహాల కోసం గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు.

Updated Date - Jun 17 , 2025 | 12:09 AM