Share News

Revenue Reputation రెవెన్యూ ప్రతిష్ఠను పెంపొందించాలి

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:08 AM

Revenue Reputation Must Be Enhanced జిల్లా రెవెన్యూ శాఖ ప్రతిష్ఠను మరింత పెంపొందిం చాలని, ఆ దిశగా అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహసీల్దార్‌ వరకు అంతా నిబద్ధతతో పనిచేయాలన్నారు.

Revenue Reputation   రెవెన్యూ ప్రతిష్ఠను పెంపొందించాలి
కార్య క్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూ శాఖ ప్రతిష్ఠను మరింత పెంపొందిం చాలని, ఆ దిశగా అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహసీల్దార్‌ వరకు అంతా నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి..ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా రెవెన్యూ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ చాలా కీలకమైనది. రాబోయే రోజుల్లో ప్రతి పనీ డిజిటలైజేషన్‌ అవుతుంది. ఉద్యోగులంతా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.’ అని తెలిపారు. అనంతరం పులువురు ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉపాధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, జిల్లా సంఘం అధ్యక్షుడు సింహాచలంనాయుడు, కలెక్టర్‌ పరిపాలనాధికారి రాధాకృష్ణమూర్తి , ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:08 AM