రెవెన్యూ వసూళ్లను ముమ్మరం చేయాలి: కమిషనర్
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:45 PM
రెవెన్యూ వసూళ్లను ముమ్మరం చేసి నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని నగరపాలకసంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. బుధవారం విజయనగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి, సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అలాగే సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు త్పపవని నల్లనయ్య తెలిపారు. నగరంలోని రింగురోడ్డు,తోటపాలెం, రాజీవ్‌నగర్ కాలనీల్ల్లో ఆయన పర్యటించారు.
విజయనగరం టౌన్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ వసూళ్లను ముమ్మరం చేసి నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని నగరపాలకసంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. బుధవారం విజయనగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి, సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అలాగే సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు త్పపవని నల్లనయ్య తెలిపారు. నగరంలోని రింగురోడ్డు,తోటపాలెం, రాజీవ్‌నగర్ కాలనీల్ల్లో ఆయన పర్యటించారు.
సమయపాలన పాటించాలి
వేపాడ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి):విఽధి నిర్వహణలో సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని ఎంపీడీవో సీహెచ్ సూర్యనారాయణ హెచ్చరించారు. బుధవారం మండలంలోని సోంపురం గ్రామసచివాలయాన్ని తనిఖీచేశారు. ఈసందర్భంగా చెత్తకు సంపద కేంద్రాన్ని పరిశీలించారు. తడి,పొడి చెత్త విడివిడిగా సేకరించాలని, తడిచెత్త నుంచి వర్మీకంపోస్టు తయారు చేయాలని సూచించారు. అనంతరం గ్రామం లో ఉపాధిహామీ పనులను పరిశీలించారు.