Share News

సర్టిఫికెట్లు తీసుకుని తిరిగి వెళుతూ..

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:56 PM

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలో పాత జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీర ఘట్టం మండలం గదబవలసకి చెందిన చిలకల శేఖర్‌(25) తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు.

సర్టిఫికెట్లు తీసుకుని తిరిగి వెళుతూ..

  • రోడ్డు ప్రమాదం

  • యువకుడికి బ్రెయిన్‌ డెడ్‌

ఎచ్చెర్ల, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలో పాత జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీర ఘట్టం మండలం గదబవలసకి చెందిన చిలకల శేఖర్‌(25) తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. ఎస్‌ఐ వి.సందీప్‌ కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బీపీఈడీ పూర్తి చేసిన శేఖర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూని వర్సిటీలో సర్టిఫికెట్లు తీసుకుని మోటారు బైక్‌పై తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు రావడంతో క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచారు. బీపీఈడీ పూర్తిచేసి గుంటూరులో ఎంపీఈడీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సిద్ధమైన శేఖర్‌కు ఇలా ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు.

Updated Date - Aug 30 , 2025 | 11:56 PM