లారీ ఢీకొని రిటైర్డ్ అధికారి మృతి
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:06 AM
విజయనగరం పట్టణం లోని కలెక్టర్ బంగ్లా సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమా దంలో రిటైర్డ్ అధికారి మృతిచెందారు.
విజయనగరం క్రైం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): విజయనగరం పట్టణం లోని కలెక్టర్ బంగ్లా సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమా దంలో రిటైర్డ్ అధికారి మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం పట్టణానికి చెందిన బంగారునాయుడు(63) జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. తాను నివాసం ఉంటున్న కామాక్షినగర్ నుంచి ద్విచక్ర వాహనంపై కలెక్టర్ బంగ్లా వైపు వస్తుండగా.. ఎస్.కోట వైపు నుంచి పట్టణంలోనికి వస్తున్న ఓ లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.