ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:57 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు.
- ఏఎస్పీ సౌమ్యలత
విజయనగరం క్రైం, జూన్ 16 ( ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై 46 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూ తగాదాలపై 14, కుటుంబ కలహాలపై 10, మోసాలపై 1, ఇతర అంశాలకు సంబంధించి 21 ఫిర్యాదులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిశీలించి వాటి పూర్వాపరాలపై విచారణ చేపట్టాలన్నారు. వాస్తవని తేలితే చట్ట పరిధిలో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ వివరాలను నివేదిక రూపంలో ఏడు రోజుల్లో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.