పెండింగ్ అంశాలు పరిష్కరించండి
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:58 PM
పెండింగ్ అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ సెర్ప్ వ్యవహారాల శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. బుధవారం సాయంత్రం జిల్లాలో జరుగుతున్న పలు అభి వృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టరుతో చర్చించారు.
విజయనగరం, కలెక్టరేట్ డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ సెర్ప్ వ్యవహారాల శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. బుధవారం సాయంత్రం జిల్లాలో జరుగుతున్న పలు అభి వృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టరుతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు పారి శ్రామికంగా పెద్ద పీటవేస్తున్న నేపధ్యంలో కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటు కోసం సత్వర చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పరిశ్రమల్లో వచ్చే ఉద్యోగాలకు అను గుణంగా నిరుద్యోగులకు సిల్క్ డెవలప్‌మెంట్ ద్వారా నైపుణ్యం శిక్షణ అందించి, ఎక్కువ ఉద్యోగాలు స్దానికులకు దక్కేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభు త్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.