నల్లజెండాలతో నిర్వాసితుల నిరసన
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:24 AM
మండలంలోని బొడ్డవర వద్ద 141రోజులుగా జిందాల్ నుంచి తమ భూములు ఇప్పించాలని శాంతి యుతంగా ఆందోళనచేస్తున్న నిర్వాసితులు శుక్రవారం రెవెన్యూ అధి కారులతీరుపై నల్లజెండాలతో నిరసన తెలిపారు.
ఎస్.కోట రూరల్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డవర వద్ద 141రోజులుగా జిందాల్ నుంచి తమ భూములు ఇప్పించాలని శాంతి యుతంగా ఆందోళనచేస్తున్న నిర్వాసితులు శుక్రవారం రెవెన్యూ అధి కారులతీరుపై నల్లజెండాలతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా మాట్లాడు తూ న్యాయపరమైన కోర్కెలు తీర్చాలని నాలుగునెలలుగా నిరసన తెలి యజేస్తున్నామని తెలిపారు. 18 ఏళ్లుగా తమను పట్టించుకోని జిందాల్ యాజమాన్యం కోసం రైతులతో పెదఖండేపల్లిలో రహస్య సమావేశాలు నిర్వహించి మభ్యపెట్టే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు.