Share News

వినతులు తక్షణమే పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:18 AM

ప్రజల నుంచి అందిన వినతులుతక్షణమే పరిష్కరించాఙలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆదేశించారు. శుక్రవారం వేపాడ తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన పీజీ ఆర్‌ఎస్‌లో ప్రజలనుంచి వినతు లు స్వీకరించారు.

వినతులు తక్షణమే పరిష్కరించాలి
అర్జీదారునితో మాట్లాడుతున్న లలితకుమారి

శృంగవరపుకోట , నవంబరు 7 (ఆంధ్ర జ్యోతి): ప్రజల నుంచి అందిన వినతులుతక్షణమే పరిష్కరించాఙలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆదేశించారు. శుక్రవారం వేపాడ తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన పీజీ ఆర్‌ఎస్‌లో ప్రజలనుంచి వినతు లు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారం జరిగే వరకు అధికా రులు పర్యవేక్షించాలని కోరారు. భూ, విద్యుత్‌ సమస్యలు, గృహనిర్మాణాలు, రోడ్లు, ఇరిగేషన్‌,హెల్త్‌ ఆరోగ్యం, పెన్షన్లు, ఉపాధి నిధులు, వ్యవసాయ సమస్యలపై 200కి పైగా ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలోతహసీల్దార్‌ జె.రాములమ్మ,ఎంపీడీవో సూర్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ దేవి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కోట్యాడ రమణమూర్తి పోతల వెంక టరమణ, లక్ష్మి, భారతి, దేముడునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 12:18 AM