Reports నివేదికలు అందించాలి
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:02 AM
Reports Must Be Submitted గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించిన పూర్తి నివేదికలను ఈ నెల 11లోగా అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం విజయనగరం జడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ ఎంపీడీవోలకు సమాచారం అందించారు.
గరుగుబిల్లి, జూలై 9(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించిన పూర్తి నివేదికలను ఈ నెల 11లోగా అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం విజయనగరం జడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ ఎంపీడీవోలకు సమాచారం అందించారు. మండలంలో క్రీడా పోటీల నిర్వహణకు ఎంతమేర నిధులు మంజూరు చేశారు, సామగ్రి ఎంతమేర సరఫరా చేశారన్న వివరాలను పూర్తిస్థాయిలో అందించాలని కోరారు. వాస్తవంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023, డిసెంబరు నుంచి 2024, జనవరి రెండో వారం వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలను నిర్వహించారు. అప్పట్లో వాటి నిర్వహణకు రూ. 10 వేలు నుంచి రూ. 15 వేల వరకు మంజూరు చేశారు. వైసీపీ నాయకులు కనుసన్నల్లోనే పోటీలు నిర్వహించారు. అయితే ఆడుదాం ఆంధ్ర నిర్వహణలో పలు అవకతవకలు నెలకొన్నాయని ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం విజిలెన్స్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. గత నెల రోజుల కిందట ఆదేశాలు జారీ చేసినా అధికారులు అంతగా స్పందించలేదు. ప్రస్తుతం రాష్ట్ర కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో సంబంఽధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సమాచారం కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే నిధులు మంజూరు, వ్యయంపై ప్రత్యేక ఫార్మట్లును మండలాలకు అందించారు. వాటిల్లో పొందుపర్చిన అంశాలను పరిశీలించిన తర్వాత మండల స్థాయిలో విజిలెన్స్ విచారణ జరగనుంది.