Share News

మహావీర్‌ భూములపై కలెక్టర్‌కు నివేదిక

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:07 AM

మహావీర్‌ కంపెనీకి విక్రయించిన భూములపై నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన్‌రావు తెలిపారు.

మహావీర్‌ భూములపై కలెక్టర్‌కు నివేదిక
రైతులతో మాట్లాడుతున్న రామ్మోహనరావు :

బాడంగి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మహావీర్‌ కంపెనీకి విక్రయించిన భూములపై నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన్‌రావు తెలిపారు. మహావీర్‌ కంపెనీ భూముల అప్పగించాలని డొంకినవలసకు చెందిన 40 మంది రైతులు ఇటీవల కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన్‌రావుకు విచారించాలని ఆదేశించారు. గతంలో ఓసారి ఆర్డీవో విచారణకు రాగా అందరు మూ కుమ్మడిగా ఏకవాగ్మూలం ఇచ్చారు. దీనిని కలెక్టర్‌కు ఆర్డీవో పంపించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో వేర్వేరుగా అర్జీలు చేసుకున్న సందర్భంగా వారి అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు. దీంతో శనివారం ఆర్డీవో రామ్మోహనరావు సిబ్బందితో డొంకినవలస చేరుకొని విచారణ నిర్వహించారు. ఈసందర్భండా 20మంది రైతులు హాజరయ్యారు. 1980-81లో తమ భూములను ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని పేర్కొనడం వల్లే భూములు కంపెనీకి విక్రయించామని తెలిపారు. 45 సంవత్సరాల నుంచి వారు ఎటువంటి అభివృద్ధి చేయలేదని, దీంతో తిరిగి భూములను తమకు అప్పగించాలని రైతులు ఆర్డీవోను కోరారు. అనంతరం ఆర్డీవో విలే కరులతో మాట్లాడుతూ రైతులు 1980-81లో మహావీర్‌ కంపెనీకి విక్రయిం చినట్లు రైతులుఒప్పుకున్నారని,దీనిని నమోదుచేశామని కలెక్టర్‌కు నివేదించ నున్నామని తెలిపారు.అయితే రైతులు రిజిస్ర్టేషన్‌ చేసిన తర్వాత భూములు తమకు తిరిగి అప్పగించాలన్న విషయాన్ని తెలియజేశారని, ఈ విష యాలను పొందుపరచామని, ఇదేవిషయాన్ని కలెక్టర్‌కు నివేదించి వారి ఆదేశాల అనుగుణంగా ముందుకువెళ్తామని చెప్పారు. ప్రస్తుతం రైతులు ఈ కంపెనీ భూములను సాగుచేసుకుంటున్నట్లు విచారణలో తేలినట్టు ఆయన చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వరప్రసాద్‌, డీటీలు రమేష్‌, అప్పలనాయుడు, ఎస్‌ఐ తారకేశ్వరరావు, సిబ్బంది రెవెన్యూ సిబ్బంది, గ్రా మానికి చెందిన డాక్టర్‌ గోపీనాథ్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆర్నెపల్లి సింహాచలం, అర్జీదారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:07 AM