Share News

రైల్వే సమస్యలపై డీఆర్‌ఎంకు నివేదిక

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:57 PM

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోగల పలు రైల్వే సంబంధిత సమస్యలపై డీఆర్‌ఎంకు నివేదిక అందజేస్తానని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. శనివారం స్ధానిక రైల్వేస్టేషన్‌లో అప్పలనాయుడుతోపాటు ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడులు పరిశీలించారు.

రైల్వే సమస్యలపై డీఆర్‌ఎంకు నివేదిక
రైల్వే సమస్యలపై ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు

బొబ్బిలి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోగల పలు రైల్వే సంబంధిత సమస్యలపై డీఆర్‌ఎంకు నివేదిక అందజేస్తానని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. శనివారం స్ధానిక రైల్వేస్టేషన్‌లో అప్పలనాయుడుతోపాటు ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడులు పరిశీలించారు.ఈస్ట్‌కోస్ట్‌ డివిజన్‌ రైల్వే అధికారులతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటుచేసి బొబ్బిలి రాజ మహల్‌ గేటు రైల్వేరోడ్డు విస్తీర్ణం, మల్లమ్మపేటలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న కాంపౌండ్‌వాల్‌, రైల్వే శ్రామికుల ఉపాధి, బొబ్బిలిలో వందేభారత్‌ రైలుహాల్ట్‌, బొబ్బిలిగూడ్స్‌ వ్యాగన్‌ లోడింగ్‌, అన్‌లోడింగ్‌ పాయింట్‌ సమస్య, డొంకినవలస ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంపై అధికారులతో అధ్యయనం చేశా రు.కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజరు రవివర్మ పాల్గొన్నారు.

ఫరామభద్రపురం, జూలై19 (ఆంధ్రజ్యోతి): దత్తిరాజేరు మండలం మానాపురం వద్ద కొత్తగా రైల్వే స్టేషన్‌ నిర్మాణం చేపట్టా లని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మడక తిరుప తినాయుడు కోరారు. శనివారం తెంటువలస గ్రామాన్ని సందర్శించిన ఎంపీని.. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈప్రాంతంలో ఎక్కువగా పేదలు ఉండటం, వలసలు ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారన్నారు. మానాపురంవద్ద రైల్వే స్టేషన్‌ నిర్మాణం చేస్తే ఈప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగం ఉంటుం దన్నారు. ఇక్కడ కొత్త రైల్వే స్టేషన్‌ నిర్మాణం చేపట్టడం వల్ల దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రపురం, బాడంగి తదితర మండలాల ప్రయాణికులకు ఎంతో అనువుగా ఉంటుంద న్నారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు, రామభద్రపురం టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి గంట సాయికుమార్‌ పాల్గొన్నారు.

కాజ్‌వే కోసం పరిశీలన

బాడంగి, జూలై 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని డొంకినవలస రైల్వే స్టేషన్‌ వద్ద గోపీనాథ పట్నాయక్‌ చెరువు వాగును ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు శనివారం పరిశీలించారు. ఇక్కడ కాజ్‌వే నిర్మించాలని ఎమ్మెల్యే బేబీనాయన,బుడా చైర్మన్‌ తెంటు లక్ష్ముంనాయుడులకు డొంకినవలస పిర్కా గ్రామస్థులు పలుపార్లు విన్నవించారు. దీంతో ఆ కాజ్‌వే రైల్వే స్థలంలో ఉండడంతో ప్రయాణానికి అవస్థలు పడుతున్నామని ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లారు.దీంతో ఆయన కాజ్‌వే వద్ద పరిశీలించారు. ఎంపీ అప్పలనాయుడు రైల్వే అధికారులకు ఫోన్‌చేసి అక్కడికి రప్పించారు. రైల్వే అధికారు లతో మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వాలు ఉన్నాయని, అవసర మైతే రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని, ఇక్కడ కాజ్‌వే లేని ఎడల రైల్వే ఫైఓవర్‌ నిర్మించాలని కోరారు. . దీనిపై రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని రైల్వే అధికారులు ఎంపికి తెలిపారు.

Updated Date - Jul 19 , 2025 | 11:57 PM