Share News

ఫిర్యాదులపై సీడీఎంఏకు నివేదిక

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:25 AM

ఫిర్యాదు లపై నివేదికను అమరావతిలోని సీడీఎంఏ పంపించిన తర్వాతవిచారణ అనంతరం చర్యలు చేపడతామని ముని సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ రవీంద్ర తెలిపారు.

 ఫిర్యాదులపై సీడీఎంఏకు నివేదిక
ఫిర్యాదుదారులను విచారిస్తున్న రవీంద్ర :

పార్వతీపురంటౌన్‌,జూన్‌5 (ఆంధ్రజ్యోతి): ఫిర్యాదు లపై నివేదికను అమరావతిలోని సీడీఎంఏ పంపించిన తర్వాతవిచారణ అనంతరం చర్యలు చేపడతామని ముని సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ రవీంద్ర తెలిపారు. గురువారం పార్వతీపురంలోని మున్సిపల్‌ కమిషనర్‌ చాంబర్‌లో నిబంధనలు, చట్టాలపై మునిసిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లుపై వచ్చిన ఫిర్యాదులపై రవీంద్ర విచారణ చేపట్టారు. అనంతరం రవీంద్ర విలేకరులతో మాట్లాడు తూ గతనెల 16న మునిసిపల్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలో వచ్చిన సమస్యల పరిష్కారంతోపాటు ఇటీవల సీడీఎంఏ సంపత్‌కుమార్‌కు మునిసిపల్‌ కమిషనర్‌పై పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు.మాజీ కౌన్సిలర్‌, నాయుడు వీధికి చెందిన గొర్లి వెంకటరమణ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ఆశీలు వసూలు జరుగుతోందని కమిషనర్‌పై ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు.పట్టణ సమస్యలతోపాటు కమిషనర్‌పై ఫిర్యాదు చేసిన మాజీ కౌన్సిలర్‌ పాకల సన్యాసిరావు విచారణకు హజరు కాలేదన్నారు.నైట్‌షెల్టర్‌ నిర్వహణకు గతఏడాది సెప్టెంబరులో కౌన్సిల్‌ ఆమోదం తెలిపినా కమిషనర్‌ అనుమతి ఇవ్వడం లేదని అరస్వా ఎన్‌జీవో నిర్వహకురాలు దయామణి ఫిర్యాదులపై విచారించామన్నారు.మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బి.గౌరీశ్వరీ, కమిషనర్‌తోపాటు అధికారుల వ్యవహర తీరుపై ఇచ్చిన ఫిర్యాదులను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కొత్తవలస సమీపంలోని జగనన్న లేఅవుట్‌లో 16 సెంట్లు అక్రమణలకు గురైయ్యిందని, రెవెన్యూ అధికారులు స్పష్టం చేసినా మునిసి పల్‌ ప్రణాళిక విభాగం అధికారులతోపాటు కమిషనర్‌ చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుపై రీజినల్‌ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పారు.

Updated Date - Jun 06 , 2025 | 12:25 AM