కాలువలకు మరమ్మతులు చేయండి
ABN , Publish Date - May 06 , 2025 | 11:57 PM
):కాలువలకు మరమ్మతులు చేసి తక్షణమే తోటపల్లి నుంచి ఆయకట్టుకు నీరివ్వాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్‌చేశారు.ఈమేరకు మంగళవారం పట్టణంలోని దుర్గగుడి సెంటర్ నుం చి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు.
పాలకొండ, మే6 (ఆంధ్రజ్యోతి):కాలువలకు మరమ్మతులు చేసి తక్షణమే తోటపల్లి నుంచి ఆయకట్టుకు నీరివ్వాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్‌చేశారు.ఈమేరకు మంగళవారం పట్టణంలోని దుర్గగుడి సెంటర్ నుం చి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటుదాసు మాట్లాడుతూ పాలకొండ, వీరఘట్టం, జీఎంవలస మండలాల్లో దాదాపు 33 గ్రామాల పరిధిలో 8,550 ఎకరాల తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టుకు కొద్దేళ్లుగా నీరందక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. పెద్దబుడ్డిడి వద్ద సైఫాన్ పాడైనా ఇంతవరకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. అనం తరం సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిప త్రం అందించారు.ధర్నాకు సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, గిరిజన సంఘం నాయకులు ఎం.తిరుపతిరావు, వ్యవసాయ సంఘ నాయకులు దూసి దుర్గారావు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు, రైతు సంఘం నాయకులు ఇద్దుబోయిన సింహాద్రి, గంగుల శ్రీనివాస్,బోనుమంతుల సోమశేఖర్, కరణంరవి, దుప్పాడ గౌరు నాయుడు, రౌతు స్వామిబాబు, పడాల రామచం ద్రరావు, వెన్నపు నారాయణరావు, కోండ్రు సింహాచలం, సంగంనా యుడు, నారాయణరావు, గుంటుపల్లి కృష్ణ, అప్పన్న, సత్యారావు, శంకరరావు, నరసింహపాణి గ్రాహి పాల్గొన్నారు.