కాలువపై ఆక్రమణలు తొలగించండి
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:35 PM
తోటపల్లి కుడికాలువ నుంచి లింగయ్య చెరువు కు సుమారు 300 మీటర్ల పొడవు గల పిల్ల కాలువ పరిధిలో ఆక్రమణలు తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్మి పి.శంకరరావు కోరారు.

తెర్లాం, మార్చి16 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి కుడికాలువ నుంచి లింగయ్య చెరువు కు సుమారు 300 మీటర్ల పొడవు గల పిల్ల కాలువ పరిధిలో ఆక్రమణలు తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్మి పి.శంకరరావు కోరారు. కాలువ గట్టుపై నాటు బండి వెళ్లేంతమార్గం ఉండేదని, దీనిని నెమాలాం గ్రామానికి చెందిన ఓ రైతు ఆక్రమిం చారని తెలిపారు. 19ఏళ్లుగా పలు ప్రభుత్వాలకు విన్నవించినా ఫలితం లేకపోయిం దని వాపోయారు. ఈ కాలువ ద్వారా సతివాడ, విజయరాం పురం, ఎన్.బూర్జివలస, అప్పలంపేట, నెమాలాం గ్రామాల్లోని చెరువులు, పీడర్ చానల్ ద్వారా నిండి 1500 ఎకరాలకు నీరందాల్సిఉందని తెలిపారు. ప్రస్తుతం ఆక్రమణల వల్ల నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆక్ర మణదారులపై చర్యలు తీసుకోకపోతే ఈనెల20న తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎంనాయకులు రామారావు, ధనుంజేయరావు, గోపాలం పాల్గొన్నారు.