Share News

అనధికార కట్టడం తొలగింపు

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:56 PM

విజయనగరంలోని పూల్‌భాగ్‌ ప్రాంతంలోని ప్రేమ సమాజం వద్ద అనధికార కట్టడాన్ని నగరపాలక సంస్థ సిబ్బంది మంగళవారం తొలగించారు. ఈ మేరకు నిర్మాణ సామగ్రిని స్వాధినం చేసుకున్నారు. ఈ సం దర్భంగా కమిషనర్‌ పి.నల్లనయ్య తొలగింపు కార్య క్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ నగరంలో కార్పొరేషన్‌ అధికారులు అను మతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని అక్ర మకట్టడాలు జరిగితే ఉపేక్షించేదిలేదని స్పష్టంచేశా రు.

అనధికార కట్టడం తొలగింపు
ల్‌బాగ్‌లోని అక్రమ కట్టడాన్ని తొలగిస్తున్న కార్పొరేషన్‌ సిబ్బంది

విజయనగరం టౌన్‌, నవంబరు11(ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని పూల్‌భాగ్‌ ప్రాంతంలోని ప్రేమ సమాజం వద్ద అనధికార కట్టడాన్ని నగరపాలక సంస్థ సిబ్బంది మంగళవారం తొలగించారు. ఈ మేరకు నిర్మాణ సామగ్రిని స్వాధినం చేసుకున్నారు. ఈ సం దర్భంగా కమిషనర్‌ పి.నల్లనయ్య తొలగింపు కార్య క్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ నగరంలో కార్పొరేషన్‌ అధికారులు అను మతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని అక్ర మకట్టడాలు జరిగితే ఉపేక్షించేదిలేదని స్పష్టంచేశా రు. నగర క్రమబద్దీకరణలో భాగంగా ఏ ఒక్క అనధి కార నిర్మాణాన్ని అనుమతించబోమని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

డోలపేట సమీపంలో..

రాజాం, నవంబరు, 11 (ఆంధ్రజ్యోతి): రాజాం మునిసిపాలిటీ పరిధిలోని డోలపేట సమీపంలో అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం రాత్రి తొలగించారు. కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని గుర్తించిన అధికారులు తొల గింపు చర్యలు చేపట్టారు. పట్టణ ప్లానింగ్‌ అధికారి శాస్త్రీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:56 PM