Share News

Nandivanivalasa నందివానివలసకు తరలింపు

ABN , Publish Date - May 11 , 2025 | 10:55 PM

Relocation to Nandivanivalasa అటవీశాఖాధికారులు గజరాజుల దారి మళ్లించారు. అవి ఎవరిపైనా దాడి చేయకుండా ఆదివారం నందివానివలసకు తరలించారు.

  Nandivanivalasa నందివానివలసకు తరలింపు
నందివానివలసలో సంచరిస్తున్న ఏనుగులు

గరుగుబిల్లి, మే11 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి పంచాయతీలో గత కొద్ది రోజులుగా గజరాజులు హల్‌చల్‌ చేస్తూ.. స్థానికులను హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. చేతికందిన పంటలను కూడా ధ్వంసం చేశాయి. మరోవైపు ప్రధాన రహదారికి అనుకుని అవి సంచరిస్తుండడంతో గ్రామస్థులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అటవీశాఖాధికారులు గజరాజుల దారి మళ్లించారు. అవి ఎవరిపైనా దాడి చేయకుండా ఆదివారం నందివానివలసకు తరలించారు. దీంతో ఆయా ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఏనుగులు తిరిగి రాకుండా చూడాలని వారు కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 11 , 2025 | 10:55 PM