Relief for MRCs ఎమ్మార్సీలకు మోక్షం
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:22 PM
Relief for MRCs జిల్లా పరిధిలోని మండల వనరుల కేంద్రాల (ఎమ్మార్సీ)కు మోక్షం లభించింది. ఎమ్మార్సీ భవనాల స్థితిపై ఈ నెల 16న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు మంత్రి ఆదేశాలతో రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ పీడీ బి.శ్రీనివాసరావు జిల్లాలోని 13 ఎమ్మార్సీ భవనాల నిర్మాణాలు, మరమ్మతులకు రూ. 6.89 కోట్లు మంజూరు చేశారు.
రూ.6.89 కోట్లు మంజూరు
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
గరుగుబిల్లి, జూన్27(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని మండల వనరుల కేంద్రాల (ఎమ్మార్సీ)కు మోక్షం లభించింది. ఎమ్మార్సీ భవనాల స్థితిపై ఈ నెల 16న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు మంత్రి ఆదేశాలతో రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ పీడీ బి.శ్రీనివాసరావు జిల్లాలోని 13 ఎమ్మార్సీ భవనాల నిర్మాణాలు, మరమ్మతులకు రూ. 6.89 కోట్లు మంజూరు చేశారు. సీతానగరం మండలంలోని ఎమ్మార్సీ భవనం మరమ్మతులకు రూ. 20 లక్షలు , మిగిలిన చోట్ల నూతన భవనాల నిర్మాణాలకు ఒక్కో దానికి రూ. 53 లక్షలు చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, మక్కువ, బలిజిపేట, సాలూరు, పాచిపెంట మండలాల్లో నూతన భవన నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఆదేశాలు అందాయి
జిల్లాలోని 13 మండలాల్లో శిఽథిలావస్థలో ఉన్న ఎమ్మార్సీ భవనాల స్థానంలో నూతన నిర్మాణాలకు ఆదేశాలు అందాయి. ఆయా మండలాల్లో భవనాల పరిస్థితులను పరిశీలించాలని సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఇందు కోసం అవసరమైన డిజైన్లు రూపొందించనున్నాం. నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తాం.
- ఆర్.తేజేశ్వరరావు, ఏపీసీ, సమగ్ర శిక్ష అభియాన్, పార్వతీపురం మన్యం