Share News

Thotapalli ‘తోటపల్లి’ నీరివ్వండి

ABN , Publish Date - May 28 , 2025 | 11:40 PM

Release Water from Thotapalli తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి తమ భూములకు నీరు అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. బుధవారంపాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయం నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు.

 Thotapalli ‘తోటపల్లి’ నీరివ్వండి
ర్యాలీ చేస్తున్న రైతు సంఘం నాయకులు

పాలకొండలో ర్యాలీ, ధర్నా

పాలకొండ, మే 28 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి తమ భూములకు నీరు అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. బుధవారంపాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయం నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకీరణపూర్తి చేసేందుకు నిధులుకేటాయించాలని నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుంటుదాసు మాట్లాడుతూ... తోటపల్లి పనులు పూర్తి కాకపోవడం వల్ల దాదాపు 30 గ్రామాల్లో వేలాది ఎకరాలకు నీరందడం లేదన్నారు. ఎస్‌ఐ ప్రయోగమూర్తి, ఆర్డీవో కార్యాలయం ఏవో అప్పారావుఅక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మే 6న ఇచ్చిన వినతిపత్రంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రైతులు నిలదీశారు. దీంతో వారిమధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.స్పష్టమైన హామీ ఇస్తేగానీఇక్కడ నుంచి వెళ్లేది లేదని రైతులు స్పష్టం చేశారు.అనంతరం సీఐ చంద్రమౌళి అక్కడ చేరుకొని రైతు సంఘం నాయకులు, అన్నదాతలతో మాట్లాడారు. తొందరలోనే జాయింట్‌ సమావేశం ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు, ప్రజా సంఘాల నాయకులు శాంతించారు.

Updated Date - May 30 , 2025 | 03:05 PM