Share News

Registration నిరీక్షణ లేకుండా రిజిస్ర్టేషన్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:00 AM

Registration Without Waiting రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని జిల్లా రిజిస్ర్టార్‌ పి.రామలక్ష్మి పట్నాయక్‌ తెలిపారు. నిరీక్షణ లేకుండా రిజిస్ర్టేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు.

Registration నిరీక్షణ లేకుండా రిజిస్ర్టేషన్‌
మాట్లాడుతున్న జిల్లా రిజిస్ర్టార్‌ రామలక్ష్మి పట్నాయక్‌

  • కార్యాలయాలు పనిచేస్తాయ్‌

  • జిల్లా రిజిస్ర్టార్‌ రామలక్ష్మి పట్నాయక్‌

బెలగాం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని జిల్లా రిజిస్ర్టార్‌ పి.రామలక్ష్మి పట్నాయక్‌ తెలిపారు. నిరీక్షణ లేకుండా రిజిస్ర్టేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. శుక్రవారం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ నుంచి రిజిస్ర్టార్‌ కార్యాలయంలో స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేయనున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రిజిస్ర్టేషన్‌ కోసం వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని , ఇకపై ఆ పరిస్థితి ఉండదని వెల్లడించారు. ముందస్తు స్లాట్‌ బుకింగ్‌తో నిరీక్షించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. 2024-2025 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 30, 31న రిజ్రిస్టర్‌ కార్యాలయాలు పనిచేస్తాయన్నారు. ఉగాది, రంజాన్‌ పండగలు న్నప్పటికీ తమకు సెలవు లేదని తెలిపారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.78 కోట్ల లక్ష్యం విధించిగా.. దాదాపు చేరువయ్యామని స్పష్టం చేశశరు. కురుపాం, పాలకొండలో లక్ష్యాలను అధిగమించామని, పార్వతీపురంలో రెండు శాతం వెనకబడ్డామని తెలిపారు. అయితే ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 29 , 2025 | 12:00 AM