Share News

ఆర్‌ఈసీఎస్‌ను పునరుద్ధరించాలి

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:54 PM

యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పిం చేందుకు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోరారు. చీపురు పల్లిలోని ఆర్‌ఈసీఎస్‌ను పునరద్ధరించ డానికి ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు.

ఆర్‌ఈసీఎస్‌ను పునరుద్ధరించాలి
చంద్రబాబుకు సమస్యలను వివరిస్తున్న కళావెంకటరావు:

చీపురుపల్లి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పిం చేందుకు పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోరారు. చీపురు పల్లిలోని ఆర్‌ఈసీఎస్‌ను పునరద్ధరించ డానికి ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ చీపురుపల్లి నియో జకవర్గంలో పలు పరిశ్రమలు మూత పడి ఉన్నాయని, వాటిని తెరిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో కొత్త పరిశ్రమలు నెలకొల్పి యువత ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. తోటపల్లి కాలువ పూడిక తీత, లైనింగ్‌ పనులకు తక్ష ణమే నిధులు విడుదల చేయాలని కోరారు.

Updated Date - Jun 17 , 2025 | 11:54 PM