ఏబీడీఎంతో చికిత్సల వివరాల నమోదు
ABN , Publish Date - May 03 , 2025 | 11:58 PM
22
విజయనగరం రింగురోడ్డు, మే 3 (ఆంధ్రజ్యోతి):ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం)తో ప్రతి రోగి ఆరోగ్య చికిత్సల నమోదు ప్రక్రియను నిర్వహి స్తున్నట్లు విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరిటెండెంట్ అప్పలనా యుడు తెలిపారు. శనివారం స్థానికప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆయన విలే కరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఏబీడీఎంతో ప్రతిరోగి వ్యాధుల వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రభుత్వాసుప త్రులకు వచ్చే రోగులు ముందుగా అభయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓపీ టిక్కెట్ సులువుగా ఆన్‌లైన్‌లోపొందవచ్చని తెలిపారు.సర్వజన ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరోసర్జరీ, మెడిసన్, నెఫ్రాలజీ, యురాలజీ, మెడికల్ అంకాలజీ, పలమనాలజీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. క్యాన్సర్‌కు సంబంధించి అం కాలజీ వైద్య సేవలు ప్రతిమంగళ, గురువారాలు, యురాలజీ ఓపీ సేవలు మంగళ, శుక్రవారాలు, న్యూరోసర్జరీ విభాగం ఓపీ సేవలు సోమ, గురు, శనివారాలు, న్యూరో మెడిసిన్‌విభాగం ఓపీ సేవలు సోమ, గురు, శనివారాలు, నెఫ్రాలజీ, కిడ్నీ చికిత్సలు మంగళ, శుక్రవారంలో అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరిడెంటెంట్ ఎం.శివశ్రీధర్, ఆర్‌ఎంవో కామేశ్వరరావు పాల్గొన్నారు.